ఉమ్మడి గోదావరి జిల్లాలో మూడోరోజు కోడిపందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, దెందులూరులో బరులు భారీగా ఏర్పాటు చేశారు.
కోడిపందాలతో పాటు జోరుగా పేకాట, గుండాట జరుగుతున్నాయి. పలుచోట్ల కోడిపందాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్నారు. మరికొన్ని చోట్ల బుల్లెట్ బైకులు బహుమతిగా ఇస్తున్నారు. పందాల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.