కర్లపాలెం మండలంలో సోమవారం తెల్లవారుజాము నుంచి పొగ మంచు దట్టంగా కురుస్తుంది. పొగ మంచు కారణంగా అపరాల పంటలైన పెసర, మినుము పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మినుము పంటలు ప్రస్తుతం పూత, పిందె దశకు వచ్చాయని రైతులు చెబుతున్నారు. ఈ స్థాయిలో పొగ మంచు కురవడం వలన పంటలకు నష్టం జరుగుతుందంటున్నారు. జీడి, మామిడి పూత దశలో ఉందని పండ్ల తోటలకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.