టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు జస్టిస్ అనిరుద్ధబోస్ ఈ తీర్పును చెప్పనున్నట్లు సమాచారం.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.