శ్రీ కృష్ణ జన్మభూమి-షాహి ఇద్‌గా మసీదు వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 17వ శతాబ్దపు మసీదు సర్వేను పర్యవేక్షించడానికి అలహాబాద్ హైకోర్టు.. అడ్వకేట్ కమిషనర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ ఉత్తర్వులపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. ‘‘లోకల్ కమిషనర్ అప్లికేషన్ అస్పష్టంగా ఉంది. కమిషనర్ ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి’’అని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో మసీదు సర్వేకు బ్రేక్ పడింది.