ప్రధాని నరేంద్ర మోదీ.. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ట్విటర్ వేదికగా దేశ ప్రజలతో పంచుకుంటారు. దేశ, విదేశీ పర్యటనలు.. ఏవైనా సంఘటనలు, విశేషాలు, ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా మకర సంక్రాంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. తన ట్విటర్ అకౌంట్‌లో ఆసక్తికరమైన ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ.. తన నివాసంలో పుంగనూరు ఆవులను పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి.
మకర సంక్రాంతి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ కొన్ని ఆసక్తికర ఫొటోలను షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు జాతికి చెందిన కొన్ని ఆవులకు మేత తినిపిస్తూ ప్రధాని మోదీ కనిపించారు. ప్రధాని తన నివాసంలో పుంగనూరు జాతికి చెందిన ఆవులను పెంచుకుంటున్నారు. వాటిని ఆప్యాయంగా హత్తుకుంటూ.. వాటికి గడ్డి తినిపిస్తూ ఉన్న ఫోటోలను ట్వీట్ చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఉన్న పుంగనూరు ఆవుల విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు వెతుకుతున్నారు
ఈ పుంగనూరు జాతికి చెందిన ఆవులు చాలా అరుదైనవి. సైజులో చిన్నగా ఉండే ఇవి మరుగుజ్జు పశువుల జాతుల్లో ఒక రకమైన జాతి. వీటిని అపార్ట్‌మెంట్లలో కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పుంగనూరు ఆవు పాలల్లో సాధారణ రకం ఆవుల కంటే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఈ ఆవు పాలలో బంగారం రసాయన నామమైన Au అనే మూలకం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా దేవాలయాల్లో క్షీరాభిషేకం కోసం పుంగనూరు ఆవు పాలను ఉపయోగిస్తారు.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి ఈ పుంగనూరు జాతి ఆవులు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. పుంగనూరు జాతి స్వచ్ఛత, ఆవు ఆరోగ్యాన్ని బట్టి ఒక్కో ఆవు ధర రూ. 1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న ఈ పుంగనూరు జాతి ఆవులు.. మిషన్ పుంగనూరు ప్రాజెక్టు కారణంగా మళ్లీ భారీగా పెరిగాయి.