ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆమె బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో మీనాను ఆహ్వానించారు.
ఈ వేడుకకు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ నేతలతో మీనా కనిపించడంతో ఆమె పార్టీలో చేరబోతున్నారనే వార్త వినిపిస్తోంది. ఇందులో నిజమెంత ఉందో కొద్ది రోజులు వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa