భారత్కు ప్రధాని నరేంద్ర మోడీనే అత్యుత్తమ నాయకుడని, తమ దేశంతో సంబంధాలు బలపడటానికి ఆయనే కారణమని ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ అన్నారు.
భారత్కు ప్రధానిగా మోడీ మరోసారి ఎన్నికవ్వాలని చాలా మంది అమెరికన్లు కోరుకుంటున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు ఇరు దేశాలకు కీలకమన్నారు. వీటి ఫలితాలు భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపిస్తాయన్నారు. తన మద్దతు మోడీకేనని ఆమె అన్నారు.