ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో గ్యాస్ బండలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
పేలుడు ధాటికి లారీ పూర్తిగా ధ్వంసమైంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.