గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలో జరగనున్న పరేడ్‌లో మొత్తం 51విమానాలతో ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంట్లో 29ఫైటర్ విమానాలు, 8ట్రాన్స్‌పోర్టు విమానాలు, 13హెలికాప్టర్లు ఉంటాయని ఐఏఎఫ్ వింగ్ కమాండర్ మనీశ్ తెలిపారు.
ఈ సారి తొలిసారి సీ-295 కార్గో విమానాన్ని కూడా షోలో ప్రదర్శించనున్నారు. 1971యుద్ధానికి చెందిన తంగలి ఎయిర్డ్రా ఈవెంట్‌ను ప్రదర్శనలో ఐఏఎఫ్ చూపెట్టనుంది. ఒక డకోటా ఎయిర్‌క్రాఫ్ట్, రెండు డార్నియర్లతో షో నిర్వహిస్తారు.