వైసీపీ ఎమ్మెల్యే కొడాలినానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఒక బడుద్దాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుడివాడలో ‘‘రా కదలిరా’’ బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందన్నారు. 5 వేల కుర్చీల కన్నా ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతాను అని గుట్కా, క్యాసినో, గుండాట, సన్నాసి నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేత దుయ్యబట్టారు.