ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22 సెలవు ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 08:30 PM

అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం(ఆపస్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మ ల్లికార్జునరావు, టి.దిలీప్‌చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో కోరారు. 22వతేదీ ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ఉపాద్యాయులు తప్పనిసరిగా ఆ రోజు స్కూళ్లకు హాజరుకావాల్సి ఉందన్నారు. అయితే ఆరోజు స్థానికంగా దేవాలయాల్లో శ్రీరామునికి సంబంధించిన కార్యక్రమాలు ఉండటం వల్ల విద్యార్థులు వాటిల్లో పాల్గొనలేక పోతున్నారని తెలిపారు. ఇది మె జార్టీ ఉపాధ్యాయుల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక ప్రభుత్వం పునరావాలోచించి పాఠశాలకు సెలవులు ప్రకటించి 23న పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com