కోడి కత్తి శ్రీనుకి బెయిల్ రాకుండా జగన్ చూస్తున్నారని.. ఇది చాలా దారుణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ దళిత ద్రోహి..కోడి కత్తి శ్రీను ఇంకా జైల్లో ఉండడానికి జగనే కారణమని.. శ్రీను తల్లి ఉసురు జగన్‌కి తగులుతుందన్నారు. దళిత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే...పిచ్చి వాడిగా ముద్ర వేసి, ఆయన మృతికి కారణం అయ్యారన్నారు.వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి...డోర్ డెలివరీ చేశారన్నారు. ఈ పాపాలన్నీ కడుక్కోవడానికే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం జగన్ ఆవిష్కరిస్తున్నారన్నారు.125 అడుగుల విగ్రహం కాదు...250 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినా దళితులు జగన్‌ని నమ్మరన్నారు.జగన్ హయాంలో అన్ని రంగాలు ఘోరంగా విఫలం అయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో సరైన అంబులెన్స్‌లు లేవని.. అందుకే ఏజెనీల్లో ఇంకా డోలీల్లో రోగులను తరలిస్తున్నారని చెప్పారు. ఏజన్సీ ప్రాంతాల్లో టీడీపీ హయాంలో ఫీడర్ అంబులెన్స్‌లు ఉండేవని.. .జగన్ వీటిని ఎత్తేశారని.. అందుకే మృతదేహాలను బైక్‌లో తరలించే పరిస్థితులు వచ్చాయని పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa