దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా హవిష్యూర్ను హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్) ఆవిష్కరించింది. ఇది సురక్షితం, సమర్థవంతమైనదిగా క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమైందని ఐఐఎల్ ఎండీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఏడాదికి పైగా వయసున్నవారు హవిష్యూర్ మొదటి డోసును తీసుకోవచ్చు. మొదటి డోసు తీసుకొన్న ఆరు నెలల తర్వాత రెండో డో స్ తీసుకోవాలి.