గాజాలోని హమాస్ మిలిటెంట్లపై యుద్ధం వంద రోజులు దాటిపోయినా బందీలుగా ఉన్న తమ దేశీయులను విడిపించుకోవడంలో సఫలం కాలేకపోవడంపై ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల్లో అంతర్మథనం జరుగుతోంది. హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం ద్వారానే బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకోగలమని ఇజ్రాయెల్ మాజీ సైనికాధిపతి గాడి ఐసెన్‌కోట్ అభిప్రాయపడ్డారు. ఇతరత్రా ఏ పద్ధతిలోనైనా బందీలను విడిపించుకోగలమని చెప్పడం భ్రమలు కల్పించడమేనని స్పష్టంచేశారు.