ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయోధ్య పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఫిర్యాదు నేపథ్యంలో అమెజాన్‌కు నోటీసులు ఇచ్చింది. రఘుపతి నెయ్యి లడ్డూ, అయోధ్య రామమందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డూ, రామ మందిర్ అయోధ్య ప్రసాదం-దేశీ దూద్ పేడ వంటివి అమెజాన్‌లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.