విశాఖ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రథమ కర్తవ్యంగా జివిఎంసి నిత్యం కృషి చేస్తుందని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు.
శనివారం ఆమె ఆరిలోవ బాలాజీ నగర్ లో రూ. 15 లక్షలతో సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే వైయస్సార్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.