విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య ప్రసాదరెడ్డి శనివారం వీసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో సారి ఆయనను వీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏయూ పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న ఆయనకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్ స్వాగతించారు. ఏయూ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.