ఉత్తరాంధ్ర నుంచే సార్వత్రిక ఎన్నికల సమరానికి శంఖారావం పూరించాలని వైసీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇక్కడి నుంచే పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఈ నెల 27న తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. విశాఖపట్నం-విజయనగరం జిల్లాల మధ్య ఈ సభ ఉంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. మరో రెండు రోజుల్లో వేదిక ప్రాంతాన్ని ఖరారు చేస్తామని చెప్పారు.