కోడికత్తి శీను తల్లి సావిత్రమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్లోని రామా ఫంక్షన్హాలులో ఆమె నిరాహార దీక్షను చేపట్టారు. అయితే,
ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు దళితసంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. తన కొడుకుకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని సావిత్రమ్మ స్పష్టం చేసింది.