రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ రేపు సెలవు ఇస్తున్నట్లు అస్సాం సీఎం హిమంగ బిస్వాశర్మ ప్రకటించారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ కూడా రేపు మొత్తం మూసివేస్తున్నట్లు చెప్పారు.
అదే విధంగా రేపు ప్రైవేటు విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రాష్ట్రప్రజలు సహా ఎమ్మెల్యేలు స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.