ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మరికొద్ది గంటల్లో నిర్వహించే రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇదే సమయంలో పుదుచ్ఛేరి కదిర్‌గ్రామమ్ ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే సౌమ్య.. కొబ్బరినార, తాటాకులతో పట్టాభిషేక రాముడిని రూపొందించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్, ఉపాధ్యాయులు సౌమ్యను అభినందించారు.