షోయబ్ మాలిక్ నుంచి సానియా 'ఖులా' కోరారు. అయితే తలాక్‌కి, దీనికి వ్యత్యాసం ఏంటో గమనిద్దాం. ఒక ముస్లిం పురుషుడు ‘తలాక్’ ద్వారా ఏవిధంగా ఏకపక్షంగా విడాకులు ఇస్తాడో ముస్లిం స్త్రీలకు కూడా ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కే ‘ఖులా’.
భర్త నుంచి విడాకుల ప్రక్రియను భార్య ప్రారంభించడాన్ని ‘ఖులా’ సూచిస్తుంది. భర్త నుంచి విడిపోయాక పిల్లల చదువులు, ఆర్థికసాయం అందించే బాధ్యత భర్తదేనని ‘ఖులా’ చెబుతుంది.