అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో, రెండు ప్రభుత్వ పాఠశాలలు తమ పాఠ్యాంశాల్లో హిందీని ప్రపంచ భాషగా చేర్చాయి. కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాసంస్థల్లో ఈ భాషను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దీనిని భారతీయ అమెరికన్లు స్వాగతించారు.
2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో ప్రయోగాత్మకంగా హిందీని ప్రవేశపెట్టాలని ఈ నెల 17న బోర్డ్ ఆఫ్ హార్నర్ మిడిల్ స్కూల్, ఇర్వింగ్టన్ హైస్కూల్ నిర్ణయించాయి.