అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కడప నగరంలో ఆదివారం ఉదయం శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. నగర హిందువుల ఆధ్వర్యంలో 18 అడుగుల శ్రీరాముని నిలువెత్తు రూపంతో ఉన్న విగ్రహం ఊరేగింపుగా కడప నగరంలోనీ ప్రధాన సర్కిల్స్ మీదుగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో శోభా యాత్రలో పాల్గొని పూజలు ప్రత్యేక నిర్వహించారు.