తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 40 రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోందట.
షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు.