జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు, అణగారిన వర్గాలపై దాడులు చేస్తూ సైకో పాలన సాగిస్తున్నాడని టీడీపీ నేత ధూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించి.. ప్రజల్లో గందరగోళం సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు. ప్రజలు జగన్ను నమ్మే పరిస్ధితుల్లో లేరని.. అంబేద్కర్ను తన తప్పుడు ప్రచారానికి వాడుకుంటున్నందుకు జగన్ సిగ్గుపడాలన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధూళ్ళిపాళ్ల నరేంద్ర కుమార్ హెచ్చరించారు.