కడప జిల్లా, కలికిరి శివారులోని ఒక భూమికి సంబంధించి గురువారం రాత్రి దళితులపై కొంత మంది దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని, శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినా నింది తులను అరెస్టు చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని మాలమహానాడు ఆధ్వ ర్యంలో శనివారం పోలీసు స్టేషన ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం క్రాస్‌రోడ్డు కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా మాలమహానాడు నేత సుదర్శనం మాట్లాడుతూ..... వెంటనే నిందితులను అరెస్టు చేసి శిక్షించకపోతే ధర్నాలు, నిరసనలు నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. మానవహారంతో ధర్నా కొన సాగుతుండగా వాల్మీకిపురం సీఐ సురేష్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర రావు, సిబ్బందితో వచ్చి ఉద్యమకారులతో చర్చలు జరిపి నిందితులపై తప్పనిసరిగా చర్యలుంటాయని హామీ ఇచ్చారు. కేసు తీవ్రత దృష్ట్యా దళిత సంఘాల డిమాండు మేరకు 307 సెక్షనుతో కేసు నమోదు చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. పోలీసు అధికారుల స్పష్టమైన హామీలతో దళిత నాయకులు ధర్నా విరమించారు. అయితే ధర్నా విరమణ తాత్కాలికమేనని, పోలీసుల వైపు నుంచి చర్యలు లేకుంటే రేపటి నుంచి తిరిగి కొనసాగిస్తామని మాలమ హానాడు అధ్యక్షుడు యమలా సుదర్శనం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శనం తోపాటు కార్యదర్శి అశోక్, వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎస్టీడీ హరి, నాయకులు చంద్ర, గుండా మనోహర్, మైనారిటీ జేఏసీకి చెందని హనీఫ్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.