వైఎస్ షర్మిల పై కేవీపీ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేసారు. వైఎస్ కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని.. వైఎస్సార్, షర్మిళ ఒకే బాటలో నడవడం ఆనందదాయకమని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ విభేదాలు ఉన్నా సాన్నిహిత్యం వీడలేదన్నారు. షర్మిల తనకు మేన కోడలు మాత్రమే కాదని.. కూతురుతో సమానమన్నారు. కాంగ్రెస్‌కి దిక్సూచిగా షర్మిల నిలబడి దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డని అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ అభిమానులు షర్మిలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం షర్మిలతో సాధ్యం అవుతుందని కేవీపీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు.