విజయనగరం జిల్లా, రేగిడి మండలంలోని బూరాడలో శనివారం పోలీసులు పేకాటశిబిరంపై నిర్వహించిన దాడిలో ఎనిమిది మంది పట్టుబడగా, వీరి వద్దనుంచి రూ.6,970 సీజ్చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల విధుల్లో బాగంగా నిర్వహించిన దాడుల్లో ఎనిమిది మంది పేకాటరాయుళ్లు పట్టుబడగా వీరిపై పిటి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.