మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే సైకో పోవాలి.. సైకిల్ రావాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అయన మాట్లాడుతూ ... ఎన్ని రోజులు భయపడతారు. పవన్‌కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి రావాలంటే పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు. వైసీపీలో బూతులు ఎక్కువ తిట్టినవారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నా రని ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లన్నీ పూర్తిచేసి ప్రతి ఒక్కరికి ఇళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ బలపరుస్తున్న వారి పింఛన్లను వైసీపీ రద్దుచేసింది. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో రద్దు చేసిన నాటి నుంచి వారందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించారు.