అయోధ్య రామమందిరం 2.7 ఎకరాల్లో నగర శైలిలో విస్తరించి ఉంది. ఆలయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తంగా 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.
ఆలయ నిర్మాణానికి ఇప్పటికే దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం పూర్తవడానికి మరో రూ.300 నుంచి రూ.400 కోట్లు అవసరమవుతుందని అంచనా.