ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠం వేడుక జరుగనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలు కానుంది. ఈ వేడుక అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కాగా, దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో అయోధ్యాపురి నిండిపోయింది.