రాముని అనుచరులనే రామనామిలు అంటారు. భారత దేశంలో 19వ శతాబ్దంలో రామనామి సమాజ్ ఆవిర్భవించింది. నాటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా శాంతియుత ప్రతిఘటన ద్వారా ఉద్భవించింది.
రాముడు సర్వవ్యాపి అని తెలియజేసేందుకు వారి ముఖాలు, శరీరాలపై రాముడి పేరును టాటూలుగా వేయించుకున్నారు. 150 ఏళ్ల క్రితమే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని తమ పూర్వీకులు ఊహించారని రామనామిలు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు.