అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుక అట్టహాసంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో బాలరాముడికి దేశ నలుమూలల నుంచి కానుకలు పంపిస్తున్నారు.
అయితే, గుజరాత్ సూరత్‌కు చెందిన 14 ఏళ్ల భవికా మహేశ్వరి రామమందిరం కోసం ఏకంగా రూ.52 లక్షలు విరాళంగా అందించింది. శ్రీరాముడిపై భక్తితో పదేళ్ల వయసు నుంచి రామాయణం చదవటం ప్రారంభించింది. ఆ కథలను ప్రదర్శనలు నిర్వహిస్తూ విరాళాలు సేకరించింది. భవికా దాదాపు 300పైగా ప్రదర్శనలు నిర్వహించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa