నీ 14 ఏళ్ల పాలనలో గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చావా అంటూ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజన ద్రోహి అని అన్నారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గిరిజనుల పేరెత్తే అర్హత చంద్రబాబుకు లేదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. బాబు అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్. చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు. గిరిజన ఎమ్మెల్యేపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు గిరిజన ద్రోహి. 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?. గిరిజన కార్పొరేషన్ వేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదన్నారు.