ఉత్తరాంధ్ర నుంచే వైయస్ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావం మొదలవుతుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) తెలిపారు. ఈ నెల 27న భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మీడియా సమావేశంలో మాట్లాడుతూ....సామాజిక న్యాయం ద్వారానే సమా సమాజం స్థాపన జరుగుతుందని నమ్మిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా విజయవాడ నడిబొడ్డున ప్రపంచంలో ఎత్తయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి స్మృతి వనం ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్ గారిది అని పేర్కొన్నారు. పండగ వాతావరణంలో రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనసంద్రోహం మధ్య 206 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగిందని ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేసిన ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ.. సీఎం వైయస్ జగన్ గారు ఏర్పాటుచేసిన అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రజలందరూ సందర్శించి అంబేద్కర్ భావజాలాన్ని అలవర్చుకోవాలని అన్నారు.