కాంగ్రెస్తో షర్మిల ప్రయాణాన్ని వైసీపీ నాయకులూ తప్పు పట్టారు. ఎవరి లబ్ధికోసం ఈ ప్రయత్నమని వారు నిలదీశారు. వైఎస్ కుటుంబానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ను వెనకేసుకు రావడంపై వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ మరణించాక ఆ మహానేత పేరును ఛార్జిషిట్లో చేర్చిన పార్టీకి కొమ్ముకాయడమేంటని ప్రశ్నించారు.