అయోధ్య రామయ్యకు గత 30 ఏళ్లుగా ఓ కుటుంబం వస్త్రాలు కుడుతూ తమ జన్మను సార్థకం చేసుకుంటున్నారు. అప్పట్లో ఆలయ పూజారి లాల్ దాస్ శ్రీరాముడి దుస్తులు కుట్టేపనిని బాబూ లాల్ అనే వ్యక్తికి అప్పగించారు.
ప్రస్తుతం ఆయన కుమారులు భగవత్, శంకర్లు ఆ పనిని కొనసాగిస్తున్నారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం తెలుపు, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వస్త్రాలు రామయ్యకు వేస్తారు.