అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ లను పరిష్కారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు.
ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. వీరి ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరపున పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినట్లు లక్ష్మణరావు వెల్లడించారు.