గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అంగన్వాడీ టీచర్ల సంఘం ప్రెసిడెంట్ పద్మ, కోవెలమూడి అంగన్వాడీ కార్యకర్త నవనీతం, పలు ప్రాంతాల నుంచి వచ్చిన మరికొంతమంది అంగన్వాడీ కార్యకర్తలను సోమవారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు.
వీరందరినీ ఓ బస్సులో ఎక్కించి విజయవాడ నగరం అంతా బస్సులో తిప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు వేతనాలు పెంచాలని కోరుతూ 'చలో విజయవాడ'కు పిలుపునిచ్చారు.