ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. అచ్చుతాపురం మండలంలో ఆవసోమవరం పంచాయతీలోని ఓ లేఔట్లో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు.
మృతి చెందిన యువకుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రిక్షాల పేట వీధి జగన్నాధపురం గ్రామానికి చెందిన యువకుడు కాకి ఉదయ్ కుమార్ (20) అని సీఐ బుచ్చిరాజు తెలిపారు. మనస్థాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఉంటారని సీఐ వెల్లడించారు.