కంచరపాలెం జోగారావునగర్ లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న ఎర్రయ్య సంక్రాంతి పండగ సందర్భంగా
ఈ నెల 14న కుటుంబ సభ్యులతో కలిసి కైలాసపురంలోని అత్తగారి ఇంటికి వెళ్లారు. ఆదివారం తిరిగి ఇంటికొచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలో బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించలేదు. దింతో కంచర పాలెం క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa