సీఎం జగన్ జనవరి 23న అనంతపురం(D) ఉరవకొండలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని సీఎం ప్రారంభించి, లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నారు.
రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని దాదాపు 78 లక్షల మంది పొదుపు మహిళల ఖాతాలకు మళ్లించనున్నారు. ఏప్రిల్ 11, 2019 నాటికి పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా.. ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.