కాణిపాకంస్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానం నిత్యఅన్నదానానికి చిత్తూరు వాస్తవ్యులు, కొట్రకోన కు చెందిన దాత సుమన రూ. 1, 00, 000 విలువగల చెక్కును సోమవారం సూపర్డెంట్ కోదండపాణి కి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను చిత్రపటాలను అందజేశారు.