అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామ భక్తులకు, భారత్‌కు ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికీ ఎంతో కీలకమైన అంశమని, ఇదొక చారిత్రాత్మక ఘట్టమని గిలాన్ పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర దర్శనం చేసుకోవడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు.