వనపర్తి పట్టణంలోని గాంధీ చౌక్ సబ్ పోస్ట్ ఆఫీస్ ను త్వరలో కలెక్టరేట్ లోకి మార్చనున్నట్లు సబ్ పోస్ట్ మాస్టర్ ప్రస్తుత ఆఫీసుకు పోస్టర్ అంటించారు. దీంతో ఖాతాదారులు సోమవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గాంధీ చౌక్ లో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేశారన్నారు. పోస్ట్ ఆఫీస్ ను తరలిస్తే ఖాతాదారులకు దూర భారం పెరిగి సమయం వృధా అవుతుందని స్థానికులు తెలిపారు .