కాకినాడ నగరం అంతా కాషాయిరంగు మయం అయింది. అయోధ్య రామమందిరంలో సోమవారం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఎటుచూసినా రామనామమే వినిపిస్తోంది. అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలో భానుగుడి జంక్షన్ నుండి జగన్నాధపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.