అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. అయితే, ఇదేరోజున నార్త్ అమెరికాలోని మెక్సికోలో కూడా రామ మందిరం ప్రారంభమవ్వటం విశేషం.
క్వెరాటారో నగరంలో మొట్టమొదటి రామమందిరంలో అక్కడి పూజారుల చేతుల మీదుగా నేడు రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ విషయాన్ని మెక్సికోలోని ఇండియన్ ఎంబసీ ట్విటర్‌లో వెల్లడించింది.