ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో అభయ రామ విగ్రహ ప్రతిష్ట సోమవారం ఎంతో వైభవంగా నిర్వహించారు.శ్రీ మఠం పీఠాధిపతులు 52 అడుగుల అభయ రామ విగ్రహ ప్రతిష్ట చేశారు.ముందుగా శ్రీ మఠం నందు దిగ్వివిజయరాయ లకు ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతులు సమర్పించారు.తదనంతరం ఉత్సవ మూర్తి ని పల్లకిలో అధిష్టించి మంత్రాలయం పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు