రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జి కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి మనోహర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఉరవకొండ జాతీయ రహదారిలోని మూడు రోడ్ల కూడలిలో మంగళవారం సీఎం కాన్వాయిని అడ్డగించే ప్రయత్నం చేశారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభకు సీఎం జగన్ కాన్వాయ్ బయలుదేరిందని తెలియగానే వారు అక్కడి రహదారిపై బైఠాయించారు. దీనిని గుర్తించి భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా ఆరెస్టు చేశారు.